News16th Jul 01:18 PMSunil Byrisetty1 min read
పెద్దాయనా.. టిఫిన్ బాగుందా?
ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగా అన్నార్తులకు ఆత్మీయత పంచే అన్న క్యాంటీన్లలో నిర్వహణ పరంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్
ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగా అన్నార్తులకు ఆత్మీయత పంచే అన్న క్యాంటీన్లలో నిర్వహణ పరంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ విజయవాడగాంధీనగర్‌లోని అన్న క్యాంటీన్‌ను సందర్శించి కార్యకలాపాలను పరిశీలించారు. అల్పాహారం కోసం క్యాంటీన్‌కు వచ్చిన వారితో మాట్లాడి క్యాంటీన్ సమయానికి తెరుస్తున్నారా? ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది? ఏమైనా ఫిర్యాదులున్నాయా.. అని అడిగి తెలుసుకున్నారు. ఆహార పట్టిక, టోకెన్ కౌంటర్, ఆహార పదార్థాలను స్వయంగా చెక్ చేశారు. వడ్డిస్తున్న స్థలం, డైనింగ్ ఏరియాతో పాటు పరిశుభ్రమైన స్వచ్ఛమైన తాగునీరు అందించే ఏర్పాట్లు పరిశీలించారు.