News25th Sep 05:31 PMSunil Byrisetty1 min read
పేదలకు పట్టాభిషేకాన్ని సద్వినియోగం చేసుకోండి
జిల్లాలో గతంలో ప్రభుత్వం మంజూరుచేసిన నివేశన స్థల పట్టాలకు అమ్మకపు హక్కుతో కూడిన రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించేందుకు, ప్రభుత్వ పోరంబోకు భూముల్లో గృహ నిర్మాణం చేసుకొని నివసిస్తున్న
జిల్లాలో గతంలో ప్రభుత్వం మంజూరుచేసిన నివేశన స్థల పట్టాలకు అమ్మకపు హక్కుతో కూడిన రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించేందుకు, ప్రభుత్వ పోరంబోకు భూముల్లో గృహ నిర్మాణం చేసుకొని నివసిస్తున్న అర్హులైన ఆక్రమణదారుల ఆక్రమణల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం పేదలకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని అమలుచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. అర్హులైన వారు తమ సమీప స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలను లేదా సంబంధిత తహశీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి, తమ పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారిచే ఈ నెల 30వ తేదీన విజయవాడలో జరిగే పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో అర్హులైన వారందరూ భాగస్వాములు కావాలని.. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పట్టాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం, ఇతర ప్రయోజనాలు పొందాల్సిందిగా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.