News2nd Jun 04:41 PMSunil Byrisetty1 min read

జిల్లా పీజీఆర్ఎస్‌కు 117 అర్జీలు

రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లుచేస్తున్న ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌)కు 117 అర్జీలు వ‌చ్చాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. అర్

జిల్లా పీజీఆర్ఎస్‌కు 117 అర్జీలు
రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లుచేస్తున్న ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌)కు 117 అర్జీలు వ‌చ్చాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. అర్జీలను సత్వ‌రం ప‌రిష్క‌రించ‌డం ఎంత ప్ర‌ధాన‌మో నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించ‌డం అంత‌కంటే ముఖ్య‌మ‌ని అన్నారు. క‌లెక్ట‌రేట్‌లోని శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో జ‌రిగిన జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌.. డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు, గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప్ర‌త్యేక అధికారి జి.జ్యోతితో క‌లిసి ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించారు. కార్య‌క్ర‌మంలో మొత్తం 117 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూ సేవ‌ల‌కు సంబంధించి 40 అర్జీలు, పోలీస్ శాఖ‌కు 16, మునిసిప‌ల్‌, ప‌ట్ట‌ణాభివృద్ధికి 15 అర్జీలు వ‌చ్చాయి. పౌర స‌ర‌ఫ‌రాలు, పంచాయ‌తీరాజ్ విభాగాల‌కు సంబంధించి ఏడు చొప్పున అర్జీలు రాగా బీసీ కార్పొరేష‌న్‌కు అయిదు అర్జీలు వ‌చ్చాయి. ఏపీఎస్ఆర్‌టీసీ, విభిన్న ప్ర‌తిభావంతుల సంక్షేమం, గృహ నిర్మాణం, మార్కెటింగ్‌, స‌ర్వే విభాగాల‌కు మూడు చొప్పున అర్జీలు వ‌చ్చాయి. ఏపీసీపీడీసీఎల్‌, స‌హ‌కారం, ఆరోగ్యం, ఇరిగేష‌న్ శాఖ‌ల‌కు రెండు చొప్పున అర్జీలు రాగా, డీఆర్‌డీఏ, ఉపాధిక‌ల్ప‌న‌, రిజిస్ట్రేష‌న్ అండ్ స్టాంప్స్‌, ర‌వాణా శాఖ‌ల‌కు ఒక్కో అర్జీ వ‌చ్చాయి.
Andhra Pradesh news
Vijayawada
Public Grievance Redressal System
G Lakshmisha received 117 petitions
public
జిల్లా పీజీఆర్ఎస్‌కు 117 అర్జీలు
Scroll for the next article