News18th Dec 11:51 AMSunil Byrisetty1 min read
గిరిజన గ్రామాల అభివృద్ధిపైనా కలెక్టర్లు దృష్టి పెట్టాలి
ఏపీలో 4 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేశామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 1.20 లక్షల ఫాం పాండ్స్ తవ్వి లక్ష్యాలను చేరుకున్నామన్నారు. రూ. 4,330 కోట్ల మేర ని
ఏపీలో 4 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేశామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 1.20 లక్షల ఫాం పాండ్స్ తవ్వి లక్ష్యాలను చేరుకున్నామన్నారు.
రూ. 4,330 కోట్ల మేర నిధులను వేతనాలుగా ఉపాధి హామీ నుంచి చెల్లించామని చెప్పారు. గ్రామ పంచాయితీల్లో రెవెన్యూ ఆర్జనపై దృష్టి సారించామన్నారు. గ్రామీణ స్థాయిలో పాలనా సామర్ధ్యాల పెంపు కోసం కృషి చేయాలని కలెక్టర్లకు సూచించారు. కేంద్ర పథకాల అమలులో వంద శాతం ఫలితాలు సాధించిన.. అల్లూరి, మన్యం జిల్లాల కలెక్టర్లను అభినందిస్తున్నామని పవన్ పేర్కొన్నారు.