News8th May 10:25 AMSunil Byrisetty1 min read
నా కూతురిని చూసి గర్విస్తున్నా..
తన కూతురిని చూసి గర్విస్తున్నానని కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి తాజ్ ఖురేషి భావోద్వేగమయ్యారు. దేశం కోసం తన కూతురు చేసిన మంచి పనికి ఎంతో గర్విస్తున్నానని పేర్కొన్నారు. ఒకవేళ తనకు ఇప్ప
తన కూతురిని చూసి గర్విస్తున్నానని కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి తాజ్ ఖురేషి భావోద్వేగమయ్యారు.
దేశం కోసం తన కూతురు చేసిన మంచి పనికి ఎంతో గర్విస్తున్నానని పేర్కొన్నారు.
ఒకవేళ తనకు ఇప్పుడు అవకాశం వస్తే.. పాకిస్తాన్‌ను నాశనం చేస్తానంటూ చెప్పారు.
అసలు ఈ భూమి మీద ఉండే అర్హత ఆ దాయాది దేశానికి లేనే లేదన్నారు.
తన తాత, తండ్రితో పాటు తాను కూడా భారత ఆర్మీకి సేవలు అందించానని గుర్తు చేసుకున్నారు.
ఇప్పుడు తన కుమార్తె ఆర్మీలో ఉందంటూ తాజ్ ఖురేషి గర్వంగా చెప్పారు.
తాము పాటించే ఇస్లాం శాంతినే కోరుతుందని, కానీ పాకిస్తాన్ మాత్రం వినాశనం కోరుకుంటోందని, అలాంటి దేశం ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు.
మతం కాదు.. దేశ భద్రతే కర్తవ్యమని దేశభక్తిని చాటిన ఖురేషి ఫ్యామిలీపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.