Entertainment20th Aug 12:53 PMSunil Byrisetty1 min read

ఆ కమెడియన్ సీఎం క్లాస్ మేట్!

సినీ నటుడు, కమెడియన్ రోలర్ రఘు తన క్లాస్ మేట్ ఒక సీఎం అంటూ ఆసక్తికర విషయం తెలిపారు. ‘నేను, సీఎం రేవంత్ క్లాస్‌మేట్స్.. ఒకే బెంచిపై కూర్చునేవాళ్లం’ అని గుర్తు చేసుకున్నారు. చాలా మంద

ఆ కమెడియన్ సీఎం క్లాస్ మేట్!
సినీ నటుడు, కమెడియన్ రోలర్ రఘు తన క్లాస్ మేట్ ఒక సీఎం అంటూ ఆసక్తికర విషయం తెలిపారు. ‘నేను, సీఎం రేవంత్ క్లాస్‌మేట్స్.. ఒకే బెంచిపై కూర్చునేవాళ్లం’ అని గుర్తు చేసుకున్నారు. చాలా మంది సెలబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఒకప్పుడు కలిసి చదువుకున్న వాళ్లే. ముఖ్యంగా సినీ, రాజకీయ సెలబ్రిటీలు చిన్నప్పట్నుంచి తెలిసినవాళ్ళు, కలిసి పెరిగిన వాళ్ళు, కలిసి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.గతంలో పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులతో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టారు. తాజాగా సినిమాల్లో కమెడియన్ గా ఫేమ్ తెచ్చుకున్న రఘు ఆ తర్వాత జబర్దస్త్ లో రోలర్ రఘుగా మంచి పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ తన సొంతూళ్లో బిజినెస్ చేసుకుంటున్నాడు.తాజాగా రోలర్ రఘు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను, సీఎం రేవంత్ రెడ్డి, జెట్టి కుసుమ కుమార్(కాంగ్రెస్ నేత) ముగ్గురం కాలేజ్ మేట్స్. ఒకే క్లాస్, ఒకే బెంచ్ కూడా మేము. 1989, 90 ఆ సమయంలో దోమలగూడ ఏవీ కాలేజీలో కలిసి చదువుకున్నామని పేర్కొన్నారు.
Telangana
Roller Raghu
Revanth Reddy
Chief Minister Revanth Reddy
Comedian Roller Raghu
Telugu Cinema
Tollywood
జబర్దస్త్
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
సెలబ్రిటీ వార్తలు
ఏవీ కాలేజ్
దోమలగూడ
Scroll for the next article