Spiritual12th Oct 04:59 PMSunil Byrisetty1 min read
భక్తులకు సౌకర్యవంతమైన దర్శనమే లక్ష్యం
అమ్మవారి దర్శనానికి విచ్చేసే ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన, సురక్షితమైన దర్శన అనుభవాన్ని అందించేందుకు దేవస్థానం, సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారని దేవాదాయ శాఖ కమిషనర
అమ్మవారి దర్శనానికి విచ్చేసే ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన, సురక్షితమైన దర్శన అనుభవాన్ని అందించేందుకు దేవస్థానం, సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఇంద్రకీలాద్రి పై మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా అమ్మవారి దర్శనం కలిగించడంతోపాటు గౌరవ రాష్ట్రపతి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మూలా నక్షత్రం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందని అన్నారు.
శరన్నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అమ్మవారి దర్శనం సౌకర్యవంతంగా జరిగేలా సంబంధిత అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. వీఐపీ భక్తులతో పాటు సామాన్య భక్తులందరికీ ప్రాధాన్యతనిస్తూ, భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు, భద్రతా చర్యలు పర్యవేక్షిస్తున్నారన్నారు.