News3rd Aug 09:34 AMSunil Byrisetty1 min read
వరద ముంపు ప్రాంతాలలో చర్యలు
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కృష్ణానది ప్రవాహిక ప్రాంతాలైన పునమిఘాట్, భవాని ఘాట్, మరియు సివిఆర్ ఫ్లైఓవర్, ఊర్మిళ సుబ్బారావు నగర్ పర్యటించి వరద ముంపు ప్రాంతాలను క్షేత్రస
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కృష్ణానది ప్రవాహిక ప్రాంతాలైన పునమిఘాట్, భవాని ఘాట్, మరియు సివిఆర్ ఫ్లైఓవర్, ఊర్మిళ సుబ్బారావు నగర్ పర్యటించి వరద ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వరద ముంపు ప్రాంతాలలో ముందస్తు చర్యల్లో భాగంగా ఆయిల్ ఇంజన్, మిషనరీతో వరద నీరు ప్రవాహం నివాస ప్రాంతాలకు రాకుండా చర్యలు తీసుకొని ఫ్లడ్ డ్యూటీ టీమ్స్ ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఊర్మిళ సుబ్బారావు నగర్, సివిఆర్ ఫ్లై ఓవర్ మేజర్ ఔట్ ఫాల్ డ్రైన్ లలో జరుగుతున్న డీసిల్టింగ్ పనులను పరిశీలించారు. నగరంలో డిసిల్టింగ్ పనులను నిరంతరాయంగా చేస్తుండాలని, ఎప్పటికప్పుడు సిల్ట్ లను తీస్తూ నీటి ప్రవాహానికి ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అన్నారు.