News6th Aug 03:58 PMSunil Byrisetty1 min read

మంత్రి లోకేష్ ను కలిసిన కామన్వెల్త్ గేమ్స్ విజేత

ప్రతిష్టాత్మక గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వల్లూరి అజయ్ బాబు.. కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నారా లోకేష్ ను కలిశ

మంత్రి లోకేష్ ను కలిసిన కామన్వెల్త్ గేమ్స్ విజేత
ప్రతిష్టాత్మక గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వల్లూరి అజయ్ బాబు.. కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఇటీవల గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన అజయ్ బాబు వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. రజత పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తండ్రి కాంస్య పతకం సాధించగా.. కుమారుడు 16 ఏళ్ల తర్వాత రజత పతకం సాధించి రికార్డ్ సృష్టించారని ప్రశంసించారు. వచ్చే ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యంగా అజయ్ బాబు ముందుకు సాగాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం అజయ్ బాబును మంత్రి శాలువాతో సత్కరించి, ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు.
Andhra Pradesh
Ajay Babu
Nara Lokesh
Commonwealth Games
Glasgow
Weightlifting
Silver Medal
విజయనగరం
కొండవెలగాడ
భారత క్రీడలు
ఒలింపిక్స్
క్రీడా వార్తలు
Scroll for the next article