News29th Jan 12:54 PMSunil Byrisetty1 min read

ఊరందరికీ ఒకటే వంట.. వృద్ధుల కోసం సామూహికం!

గుజరాత్‌లోని మారుమూల చిన్న గ్రామమైన చందంకి దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఎందుకంటే ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజల ఇళ్లల్లో పొయ్యి వెలగదు.. పాత్రల చప్పుళ్లు వినపడవు. మర

ఊరందరికీ ఒకటే వంట.. వృద్ధుల కోసం సామూహికం!
గుజరాత్‌లోని మారుమూల చిన్న గ్రామమైన చందంకి దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఎందుకంటే ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజల ఇళ్లల్లో పొయ్యి వెలగదు.. పాత్రల చప్పుళ్లు వినపడవు. మరి భోజనం ఎలా అంటారా? దానికి సమాధానం ఇక్కడ కొన్నాళ్లుగా కొనసాగుతోన్న సామూహిక వంటశాల. ఊర్లోని ప్రజలందరికీ రోజూ ఈ వంటశాల ద్వారానే భోజనం అందుతోంది. ఈ గ్రామంలో అందరూ వృద్ధులే కావడంతో రోజూ వంట కోసం ప్రతి ఇంటిలో ఇబ్బంది పడకుండా సామూహిక వంటశాల ఏర్పాటు చేశారు. దీంతో భోజనం సమయానికి వృద్ధులందరూ ఒకచోట చేరి, కష్టసుఖాలు పంచుకుంటూ ఆహారం తీసుకుంటారు. అందువల్ల వంట చేసుకునే శ్రమ తగ్గడంతోపాటు అందరి మధ్య కుటుంబమనే ఏకాత్మత ఏర్పడుతోంది.
Gujarat Village
Chandanki Village
Community Kitchen
Elderly Care
Social Unity
Model Village
సమూహ భోజనం
మానవత్వం
కుటుంబ భావన
గ్రామీణ అభివృద్ధి
Scroll for the next article