News26th Sep 01:52 PMSunil Byrisetty1 min read
బ్యానర్ల చించివేతపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
మంగళగిరి దసరా నవరాత్రుల సందర్భంగా పార్క్ రోడ్డు లో అమ్మవారి చిత్రాలతో మూడు బ్యానర్లను ఏర్పాటు చేశారు. వీటిలో రెండు బ్యానర్లను గుర్తు తెలియని దుండగులు చించి వేశారు. ఈ ఘటనపై శుక్రవార
మంగళగిరి దసరా నవరాత్రుల సందర్భంగా పార్క్ రోడ్డు లో అమ్మవారి చిత్రాలతో మూడు బ్యానర్లను ఏర్పాటు చేశారు. వీటిలో రెండు బ్యానర్లను గుర్తు తెలియని దుండగులు చించి వేశారు. ఈ ఘటనపై శుక్రవారం భక్తులు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మతవిద్వేషాలు రేకెత్తించేలా దారుణానికి పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని కోరారు.సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా విచారించి కేసు నమోదు చేస్తామని పట్టణ ఎస్సై శ్రీహరి తెలిపారు.