News18th Nov 10:51 AMSunil Byrisetty1 min read
ఏకంగా మంత్రి పేరుతో నకిలీ సిఫార్సులు!
కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు నకిలీలు విచ్చలవిడిగా చెలామణీలోకి వస్తున్నాయి. వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ పేరుతో నకీలీ టీటీడీ లెటర్లు జారీ అవ్వటం కలకలం రేపుతోంది. ఈ మేరకు మంత్రి పీ
కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు నకిలీలు విచ్చలవిడిగా చెలామణీలోకి వస్తున్నాయి. వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ పేరుతో నకీలీ టీటీడీ లెటర్లు జారీ అవ్వటం కలకలం రేపుతోంది. ఈ మేరకు మంత్రి పీఏ విజయవాడ నగర కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా మంత్రి పేరుతో నకిలీ లెటర్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడతామన్నారు. ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు.