News7th Oct 12:45 PMSunil Byrisetty1 min read

గోదావరి డెల్టా ఆధునీకరణకు సమగ్ర కార్యాచరణ

గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపే విధంగా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇందుకోసం రూ.13.4 కోట్ల వ్యయంతో నిర్వహించిన లైడార్ స

గోదావరి డెల్టా ఆధునీకరణకు సమగ్ర కార్యాచరణ
గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపే విధంగా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇందుకోసం రూ.13.4 కోట్ల వ్యయంతో నిర్వహించిన లైడార్ సర్వే ఆధారంగా డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ లోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో గోదావరి డెల్టా ఆధునీకరణపై ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి డెల్టా ఆధునీకరణలో భాగంగా ఇప్పటికే ఈస్ట్రన్ డెల్టాకు రూ.1,137 కోట్లు, సెంట్రల్ డెల్టాకు రూ.1,268 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. వెస్ట్రన్ డెల్టాకు సంబంధించిన అంచనాలను కూడా త్వరితగతిన సిద్ధం చేసి అందించాలని సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. డెల్టా ఆధునీకరణలో కాలువలు, డ్రెయిన్లు, బండ్‌ల స్థాయి, డీసిల్టింగ్, లాకులు, షట్టర్లు తదితర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. పూడికతో నీటి ప్రవాహానికి ఆటంకంగా మారిన సీ మౌత్‌ల వద్ద డ్రెడ్జింగ్ పనులకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
Scroll for the next article