News3rd Jan 12:36 PMSunil Byrisetty1 min read

ఆవ‌కాయ్‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

ఈ నెల 8 నుంచి 10వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు ఆవ‌కాయ్.. సినిమా, సంస్కృతి, సాహిత్య అమ‌రావ‌తి ఉత్స‌వాల‌కు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల భాగ‌స్వామ్యంతో ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు

ఆవ‌కాయ్‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు
ఈ నెల 8 నుంచి 10వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు ఆవ‌కాయ్.. సినిమా, సంస్కృతి, సాహిత్య అమ‌రావ‌తి ఉత్స‌వాల‌కు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల భాగ‌స్వామ్యంతో ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఆవ‌కాయ్ ఉత్స‌వాల‌పై జేసీ ఎస్‌.ఇల‌క్కియ‌, టీమ్‌వ‌ర్క్ (సెల‌బ్రేటింగ్ ది ఆర్ట్స్‌) సంస్థ ప్ర‌తినిధి సయ్యద్ శామ్స్‌తో క‌లిసి రెవెన్యూ, వీఎంసీ, పోలీస్‌, ప‌ర్యాట‌కం, వైద్య ఆరోగ్యం త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. పున్న‌మిఘాట్‌, భ‌వానీ ద్వీపంలో జ‌రిగే కార్య‌క్ర‌మాలు, సంద‌ర్శ‌కుల ఉచిత రిజిస్ట్రేష‌న్‌, సీటింగ్ అరేంజ్‌మెంట్‌, సంద‌ర్శ‌కుల భ‌ద్ర‌త‌, ట్రాఫిక్ ప్ర‌ణాళిక‌, వేదిక‌ల వ‌ద్ద ఏర్పాట్లు త‌దిత‌రాల‌పై చ‌ర్చించారు. 8వ తేదీ సాయంత్రం ఉత్స‌వాల ప్రారంభోత్సవ ఊరేగింపు మొద‌లు 10వ తేదీ సాయంత్రం జావేద్ అలీ సంగీత క‌చేరీ వ‌ర‌కు వివిధ కార్య‌క్ర‌మాల షెడ్యూల్‌ను ప‌రిశీలించి అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. సినిమా, సంస్కృతి, సాహిత్య వైభ‌వాన్ని ఒకేవేదిక‌పైకి తెచ్చే గొప్ప ఉత్స‌వాలు ఇవ‌ని పేర్కొన్నారు.
Avakay Festival
Amaravati Festival
Cinema Culture Literature
Event Arrangements
Visitor Registration
Safety Measures
న్యాయసభ అధికారులు
జావేద్ అలీ సంగీత కచేరీ
మూడు రోజుల
Scroll for the next article