News31st Oct 05:18 PMSunil Byrisetty1 min read

తీర ప్రాంత గ్రామాల రక్షణపై బృహత్ ప్రణాళిక

మొంథా తుపానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించాలని సూచించ

తీర ప్రాంత గ్రామాల రక్షణపై బృహత్ ప్రణాళిక
మొంథా తుపానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. కాకినాడ జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకీ న్యాయం జరగాలన్నారు. పిఠాపురం నియోజక వర్గంలో పరిస్థితిపై ఆరా తీశారు. ఏలేరు కాలువ గట్టు పటిష్టతకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, మల్లవరం పత్తి రైతులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తుపాను అనంతర ఉపశమన చర్యలపైనా పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.
Andhra Pradesh
Cyclone Relief
Pawan Kalyan
Kakinada
Coastal Protection
Disaster Management
తుపాను సహాయం
కాకినాడ
తీర రక్షణ
విపత్తు నిర్వహణ
Scroll for the next article