News22nd Jun 01:29 PMSunil Byrisetty1 min read

అస‌ర‌వ‌ల్లి దేవ‌స్ధానం అభివృద్ధికి స‌మ‌గ్ర ప్ర‌ణాళిక

అస‌ర‌వ‌ల్లి దేవ‌స్ధానం అభివృద్ధికి స‌మ‌గ్ర ప్ర‌ణాళిక రూపొందించాలని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఆరోగ్య ప్ర‌దాత ప్ర‌త్య‌క్ష భ‌వ‌గానుడైన సూర్య‌నారాయ‌ణ స్వ

అస‌ర‌వ‌ల్లి దేవ‌స్ధానం అభివృద్ధికి  స‌మ‌గ్ర ప్ర‌ణాళిక
అస‌ర‌వ‌ల్లి దేవ‌స్ధానం అభివృద్ధికి స‌మ‌గ్ర ప్ర‌ణాళిక రూపొందించాలని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఆరోగ్య ప్ర‌దాత ప్ర‌త్య‌క్ష భ‌వ‌గానుడైన సూర్య‌నారాయ‌ణ స్వామి దేవ‌స్ధానం అభివృద్ధికి స‌మ‌గ్ర ప్ర‌ణాళిక త‌యారు చేయాల‌ని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఆదివారం అస‌ర‌వ‌ల్లి దేవ‌స్ధానం కార్య‌నిర్వాహ‌ణాధికారిగా బాధ్య‌తలు స్వీక‌రించిన కె.ఎన్‌.వి.డి.వి. ప్ర‌సాదరావు నిమ్మాడ క్యాంప్ కార్యాల‌యంలో మంత్రిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి పుష్ప‌గుచ్చం అందించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ప‌లు సూచ‌న‌లు చేశారు. భక్తులకు అసౌక‌ర్యం క‌ల‌గకుండా స్వామిద‌ర్శనం క‌ల్పించాల‌ని సూచించారు. దేవాల‌యం అభివృద్ధిపై త్వ‌ర‌లోనే ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌ని, అందుకు అవ‌స‌ర‌మైన అభివృద్ధికి, సమగ్ర నివేదిక త‌యారు చేయాల‌ని ఆదేశించారు.
Andhra Pradesh news
Minister Kinjarapu Atchennaidu
Asaravalli Temple
suryanarayana Swamy
development
అసరవల్లి దేవస్థానం అభివృద్ధి
Scroll for the next article