News25th Sep 05:35 PMSunil Byrisetty1 min read
పల్నాడు జిల్లా అభివృద్ధిపై సమగ్ర సమీక్ష
పల్నాడు జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార
పల్నాడు జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (DRC) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఇతర ప్రజాప్రతినిధుల, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవనం, సాగునీరు, తాగునీరు, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, వైద్యం, విద్య, మహిళా–శిశు సంక్షేమం, రహదారులు తదితర కీలక రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఎంపీ గారు సమగ్రంగా సమీక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా, సకాలంలో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.