News4th Jan 04:26 PMSunil Byrisetty1 min read

సమగ్ర క్రీడా పాలసీతో క్రీడల అభివృద్ధి

క్రీడాకారుల సంక్షేమమే లక్ష్యంగా, 2026వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ను క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి న

సమగ్ర క్రీడా పాలసీతో క్రీడల అభివృద్ధి
క్రీడాకారుల సంక్షేమమే లక్ష్యంగా, 2026వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ను క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్రీడలను ఉద్యమంగా మార్చి, ప్రతి జిల్లాలో మౌలిక వసతులు కల్పించి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో క్రీడాకారులకు రావాల్సిన బకాయిలుగా సుమారు రూ.16 కోట్లను ఇప్పటికే విడుదల చేసినట్లు, అలాగే ఫిబ్రవరి నెలలో మరో రూ.8 కోట్లను క్రీడాకారులకు అందించనున్నట్లు తెలిపారు. ఒలింపిక్స్, కామన్‌వెల్త్, ఏసియన్ గేమ్స్‌లను లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) అమలు చేస్తున్న విధానాన్ని రాష్ట్రంలోనూ అనుసరించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ దిశగా క్రీడల్లో ముందున్న తమిళనాడు సహా దాదాపు 17 రాష్ట్రాల క్రీడా విధానాలు, పనితీరును అధ్యయనం చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి కోసం సుమారు రూ.54 కోట్ల విలువైన ప్రాజెక్టులకు టెండర్లు పూర్తి చేసి, అన్ని ప్రాంతాల్లో పారదర్శకంగా పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
Andhra Pradesh Government
Sports Policy
Sports Development
Kreedandhra
స్పోర్ట్స్ అథారిటీ
ఒలింపిక్స్ లక్ష్యం
క్రీడా మౌలిక వసతులు
ప్రభుత్వ నిధులు
Scroll for the next article