News4th Sep 03:55 PMSunil Byrisetty1 min read
ఇథనాల్ శానిటైజర్ల దుర్వినియోగంపై ఆందోళన
ఇథనాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను కొందరు మద్యం ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్న నేపథ్యంలో.. వాటి విక్రయాలపై నియంత్రణ అవసరమని రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర
ఇథనాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను కొందరు మద్యం ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్న నేపథ్యంలో.. వాటి విక్రయాలపై నియంత్రణ అవసరమని రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ పీ. అరుణ్‌బాబు పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో శానిటైజర్ల నిల్వ, విక్రయాలకు ఇచ్చిన లైసెన్స్ మినహాయింపును ఇథనాల్ ఆధారిత శానిటైజర్లకు వర్తించకుండా ఉపసంహరించాలని కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ (ఇండియా)కు లేఖ రాశారు. కోవిడ్ సమయంలో శానిటైజర్ల సులభ లభ్యత కోసం కేంద్ర ప్రభుత్వం 27-07-2020న ఎస్.ఓ.245(ఈ) నోటిఫికేషన్ ద్వారా వాటి నిల్వ, విక్రయాలకు సేల్ లైసెన్స్ నుంచి మినహాయింపు ఇచ్చిందని అరుణ్‌బాబు తెలిపారు. ప్రస్తుతం ఈ మినహాయింపును కొందరు దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో మద్యానికి బదులుగా ఇథనాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను కొందరు వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో తనిఖీలు, దాడులు జరిపి కొన్ని రిటైల్ మెడికల్ షాపులు ఇథనాల్ ఆధారిత శానిటైజర్లను పెద్ద మొత్తంలో విక్రయించినట్లు గుర్తించామన్నారు.