News13th Mar 05:15 PMSunil Byrisetty1 min read

తిరుమలను కాంక్రీట్ జంగిల్ కానీయొద్దు

పవిత్ర తిరుమలను కాంక్రీట్ జంగిల్‌గా మారనీయొద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మఠాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ

తిరుమలను కాంక్రీట్ జంగిల్ కానీయొద్దు
పవిత్ర తిరుమలను కాంక్రీట్ జంగిల్‌గా మారనీయొద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మఠాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీకి సూచించింది. తిరుమలలో అక్రమ నిర్మాణాలు ఇలానే కొనసాగిస్తే కొంతకాలం తర్వాత అక్కడి అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. తిరుమలలో ధార్మిక సంస్థలు, మఠాల పేరుతో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా తిరుమలలో నిర్మాణాలు చేపట్టిన పలు మఠాలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవో, టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు మే 7వ తేదీకి వాయిదా వేసింది.
AP High Court Tirumala
TTD
High Court
Concrete jungle in Tirumala
తిరుమలలో కాంక్రీట్
హైకోర్టు
Scroll for the next article