News31st Jan 11:39 AMSunil Byrisetty1 min read

లడ్డూ కల్తీపై మైక్రో డీఎన్ఏ టెస్ట్ చేయాలి

తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీకి వినియోగించింది నెయ్యే కాదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. నూటికి నూరు శాతం కల్తీ అని పేర్కొన్నారు. ఏ కొవ్

లడ్డూ కల్తీపై మైక్రో డీఎన్ఏ టెస్ట్ చేయాలి
తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీకి వినియోగించింది నెయ్యే కాదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. నూటికి నూరు శాతం కల్తీ అని పేర్కొన్నారు. ఏ కొవ్వు ఉందో, ఏ కెమికల్స్ ఉన్నాయో నివేదికల్లో వచ్చాయన్నారు. ఏ నివేదికలోనూ యానిమల్ ఫ్యాట్ లేదని రాలేదని, దీనిపై వైయస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. లడ్డూ కల్తీ కేసు విచారణలో సీబీఐ మైక్రో డీఎన్ఏ టెస్ట్ చేయలేదని, అది చేయాలని డిమాండ్ చేశారు. మైక్రో డీఎన్ఏ టెస్ట్ చేయాలని కోర్టులో అఫిడవిట్ వేస్తామని పేర్కొన్నారు. సీబీఐ చార్జిషీటులో అనేక లోపాలున్నాయని, దీనిపై సీనియర్ అడ్వొకేట్లు, సైంటిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేశారని ఆరోపించారు. వైసీపీ నాయకులు అన్నిటికీ సీబీఐ విచారణ అంటూ అడగడానికి వారికి సిగ్గుండాలని చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh
Tirupati Laddu
Laddu Adulteration
TTD
BR Naidu
Micro DNA Test
Ghee Adulteration
CBI Chargesheet
Tirumala Tirupati Devasthanams
వైసీపీ
వైవీ సుబ్బారెడ్డి
తిరుపతి దేవస్థానం
Scroll for the next article