National18th Sep 03:39 PMSunil Byrisetty1 min read

ఓట్ల చోరీ పక్కా.. 100 శాతం ఆధారాలున్నాయ్

దేశంలో ఓట్ల చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై, కేంద్ర ఎన్నికల సంఘంపై.. ఆరోపణ

ఓట్ల చోరీ పక్కా.. 100 శాతం ఆధారాలున్నాయ్
దేశంలో ఓట్ల చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై, కేంద్ర ఎన్నికల సంఘంపై.. ఆరోపణలు చేశారు. వ్యక్తులతో కాకుండా సాఫ్ట్‌వేర్ సాయంతో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఓట్ల చోరీపై ఆటం బాంబ్ వేసినట్లు చెప్పిన రాహుల్ గాంధీ.. త్వరలోనే హైడ్రోజన్ బాంబ్ పేల్చనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ హైడ్రోజన్ బాంబ్ కంటే ముందు.. తాజాగా మరోసారి ఓట్ల చోరీ అంశంపై సంచలన ఆరోపణలు చేశారు. సెంట్రల్ సాఫ్ట్‌వేర్ సాయంతో లక్షలాది మంది పౌరుల పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాలని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే తాను 100 శాతం ఆధారాలతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కొందరు బాధితులను కూడా మీడియా ముందుకు రాహుల్ గాంధీ తీసుకొచ్చారు.
Indian Politics
Vote Theft
Rahul Gandhi
Congress Party
Election Fraud
Voter List
Opposition Leader
Modi Government
Election Commission
ప్రజాస్వామ్యం
ఓటర్ల హక్కులు
సంచలన ఆరోపణలు
Scroll for the next article