Telangana21st Aug 12:36 PMSunil Byrisetty1 min read
కొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు సంచలనంగా మారింది. ఆమెకు వ్యతిరేకంగా సీఎల్పీలో 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. సుర
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు సంచలనంగా మారింది. ఆమెకు వ్యతిరేకంగా సీఎల్పీలో 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి, టీపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు కొండా సురేఖకు పలువురు సీనియర్ మంత్రులు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల మద్దతు కనిపిస్తోంది. తనకు సుస్మిత వ్యాఖ్యలకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. సంబంధం లేకున్నా కనీసం ఖండించరా అంటూ ఎమ్మెల్యేల సూటి ప్రశ్న సంధించారు. సురేఖ వివరణ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టడం సంచలనంగా మారింది.