Politics2nd Dec 05:10 PMSunil Byrisetty1 min read
లేటుగా నిద్ర లేచిన కాంగ్రెస్.. పవన్‌పై వరుస దాడి
ఎప్పుడో వారం కిందట.. పవన్ కల్యాణ్ కోనసీమ టూర్‌లో దిష్టి వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కాంగ్రెస్ నేతలెవరికీ చురుకుదనం పుట్టలేదు. కానీ ఇప్పుడు ఎవరో గిల్లినట్లుగా ఒక్కసారిగా అందరూ బయటకు వ
ఎప్పుడో వారం కిందట.. పవన్ కల్యాణ్ కోనసీమ టూర్‌లో దిష్టి వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కాంగ్రెస్ నేతలెవరికీ చురుకుదనం పుట్టలేదు. కానీ ఇప్పుడు ఎవరో గిల్లినట్లుగా ఒక్కసారిగా అందరూ బయటకు వచ్చి.. పవన్ కల్యాణ్ క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు. సహజంగా వచ్చే రియాక్షన్ అయితే పవన్ కల్యాణ్ ఆ మాటలు అన్న వెంటనే వచ్చేస్తుంది. కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. అవంత సీరియస్ గా తీసుకుని రాజకీయం చేయాల్సిన మాటలు కాదని అనుకున్నారు. నాలుగు రోజుల తర్వాత ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి స్పందించారు. వారం తర్వాత సినిమాటో గ్రఫీ మంత్రి వెంకట్ రెడ్డి దగ్గర నుంచి చాలా మంది స్పందించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కూడా ఖండించారు. అద్దంకి దయాకర్, బీర్ల ఐలయ్య లాంటి వారూ స్పందించారు. అందరూ సేమ్ టెంప్లెట్ చదివి వినిపించారు. పవన్ క్షమాపణకు డిమాండ్ చేశారు. మరుగునపడిపోయిన అంశాన్ని పైకి తెచ్చి విమర్శులు చేస్తున్నారంటే దీని వెనుక రాజకీయ కోణం ఉందని అర్థం చేసుకోవచ్చు. అది ఎవరి రాజకీయం.. కాంగ్రెస్ రాజకీయమా.. లేక కాంగ్రెస్‌లో కోవర్టుల రాజకీయమా అన్నది ముందు ముందు తెలుస్తుంది.