Politics26th Oct 04:06 PMSunil Byrisetty1 min read
విజయవాడలో కాంగ్రెస్ విజయం తథ్యం
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల విజయం తధ్యమని మాజీ కేంద్రమంత్రి ఎం.ఎం. పల్లంరాజు అన్నారు. అజిత్ సింగ్ నగర్, వాంబే కాలనీ ప్రాంతాల్లోని 76, 77,
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల విజయం తధ్యమని మాజీ కేంద్రమంత్రి ఎం.ఎం. పల్లంరాజు అన్నారు. అజిత్ సింగ్ నగర్, వాంబే కాలనీ ప్రాంతాల్లోని 76, 77, 79 డివిజన్ల లో రోడ్ షో, ఇంటింటి ప్రచారంను కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం నిర్వహించారు. 76వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ జాఫర్ , 77వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జెరోమి కిరణ్, 79 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ కరీమున్నీసాతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు ఇంటింటికి కరపత్రాలను పంచి పెడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, ఏఐసీసీ నాయకులు కొలనుకొండ శివాజీ, మీసాల రాజేశ్వరరావు, పెద్ద సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు మాట్లాడుతూ... విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జోరుగా ప్రచారం సాగుతుందన్నారు.