News13th Nov 01:55 PMSunil Byrisetty1 min read
మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కనెక్టివిటీ పునరుద్ధరణ
మురసు తీవ్ర తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఎనిమ
మురసు తీవ్ర తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం (IMCT) శుక్రవారం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సీఈఓ ప్రఖర్ జైన్ కేంద్ర బృందానికి తుపాను తీవ్రత, రాష్ట్రంలో జరిగిన నష్టం, ప్రభుత్వం చేపట్టిన ముందస్తు సన్నద్ధత, సహాయక, పునరుద్ధరణ చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ మాట్లాడుతూ... మురసు తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టిన సహాయక, పునరుద్ధరణ చర్యలను అభినందించారు. తుపాను ప్రభావం అనంతరం కేవలం రెండు రోజుల్లోనే విద్యుత్ సరఫరా, మొబైల్ కనెక్టివిటీ, రహదారి కనెక్టివిటీని పునరుద్ధరించడం అభినందనీయమన్నారు. దీనివల్ల ప్రజల సాధారణ జీవనంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు త్వరగా పునఃప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.