News8th Oct 06:14 PMSunil Byrisetty1 min read

జగనన్న కాలనీల ఇళ్ల పట్టాల రద్దుకు కుట్ర

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలు, నిత్యావసర సేవలు దూరమయ్యాయని వైఎస్సార్‌సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణ

జగనన్న కాలనీల ఇళ్ల పట్టాల రద్దుకు కుట్ర
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలు, నిత్యావసర సేవలు దూరమయ్యాయని వైఎస్సార్‌సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రతి 2,000 మంది జనాభాకు ఒక గ్రామ, వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేసి, వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే సేవలు గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసిందని విమర్శించారు. ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందే తప్ప, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వం కనీసం పర్యవేక్షించడం లేదని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపై ఏకంగా రూ.25,000 కోట్ల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Scroll for the next article