News22nd Jan 02:22 PMSunil Byrisetty1 min read

హోంమంత్రి అనితను కలిసిన కానిస్టేబుల్ జయశాంతి

కానిస్టేబుల్ జయశాంతి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను విజయవాడలో కలిశారు. ఆమెతో కలిసి మంత్రి అనిత అల్పాహారం చేశారు. రంగంపేటకు చెందిన జయశాంతి ఇటీవల విధి నిర్వహణలో లేకపోయినా బిడ్డను చంకన

హోంమంత్రి అనితను కలిసిన కానిస్టేబుల్ జయశాంతి
కానిస్టేబుల్ జయశాంతి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను విజయవాడలో కలిశారు. ఆమెతో కలిసి మంత్రి అనిత అల్పాహారం చేశారు. రంగంపేటకు చెందిన జయశాంతి ఇటీవల విధి నిర్వహణలో లేకపోయినా బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్ ను చక్కదిద్దారు. విషయం తెలుసుకున్న మంత్రి అనిత రెండ్రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేసి అభినందించారు. ఆ సంభాషణలో మంత్రిని కలవాలనుందని జయశాంతి కోరారు. ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్ ను పిలిపించుకొని వారితో కలిసి అనిత అల్పాహారం చేశారు. ఆమె కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కానిస్టేబుల్ జయశాంతి కుటుంబ సభ్యులను మంత్రి అనిత సత్కరించారు.
Andhra Pradesh
Home Minister Anitha
Vangalapudi Anitha
Constable Jayashanthi
Vijayawada
Traffic Duty
Police Personnel
ట్రాఫిక్ విధులు
పోలీస్ సిబ్బంది
ప్రజాసేవ
Scroll for the next article