News6th Aug 04:53 PMSunil Byrisetty1 min read

జెట్ స్పీడులో మంగళగిరి ఆసుపత్రి పనులు

మంగళగిరిలో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ. 33 కోట్లకు పైగా అంచనా వ్యయంతో ఈ 100 పడకల ఆసుపత్రిని విస్తరిస్తున్నారు. గతంలో ఉన్న పరిమిత పడకల స్థానంలో

జెట్ స్పీడులో మంగళగిరి ఆసుపత్రి పనులు
మంగళగిరిలో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ. 33 కోట్లకు పైగా అంచనా వ్యయంతో ఈ 100 పడకల ఆసుపత్రిని విస్తరిస్తున్నారు. గతంలో ఉన్న పరిమిత పడకల స్థానంలో ఈ కొత్త భవనాన్ని ఆధునిక వసతులతో నిర్మిస్తున్నారు. ఇందులో అత్యవసర వైద్య విభాగం, ఐసియు, ఆపరేషన్ థియేటర్లు, శస్త్రచికిత్స విభాగాలు, స్త్రీ, శిశు సంక్షేమ వార్డులు అందుబాటులోకి రానున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. నాణ్యతలో రాజీ పడకుండా, గడువులోగా పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని అధికారులను ఆదేశించారు.
Andhra Pradesh
Healthcare
Hospital Construction
100-Bed Hospital
Mangalagiri
Government Hospital
Nara Lokesh
మౌలిక వసతులు
ఏపీ ప్రభుత్వం
వైద్య సదుపాయాలు
ఐసీయూ
అత్యవసర వైద్యం
ఆంధ్ర వార్తలు
Scroll for the next article