News17th Jul 11:55 AMSunil Byrisetty1 min read

శరవేగంగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం చినకాకాని వద్ద నిర్మించ తలపెట్టిన వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభ

శరవేగంగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం చినకాకాని వద్ద నిర్మించ తలపెట్టిన వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేయించారు మంత్రి నారా లోకేష్. సుమారు రూ. 140కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని దేశంలోని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని మంత్రి నారా లోకేష్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణంతో రోగులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏది ఏమైనా మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో మంగళగిరి నియోజకవర్గ పేదలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే బాధలు త్వరలోనే తీరనున్నాయి.
Andhra Pradesh news
Mangalagiri
nara lokesh
100-bed hospital
Construction
శరవేగంగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు
Scroll for the next article