News25th Dec 11:40 AMSunil Byrisetty1 min read
వినియాగదారులు హక్కులపట్ల అవగాహన కలిగి ఉండాలి
వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండటంతోపాటు డిజిటల్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ర్మ పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. దిల్లీ రావు తెలిపారు. జాత
వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండటంతోపాటు డిజిటల్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ర్మ పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. దిల్లీ రావు తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం-2025 సందర్భంగా రాష్ట్ర స్థాయి వేడుకలను డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ సత్వర పరిష్కారం అనే థీమ్ తో ఏర్పాటు చేయడం జరిగింది. వినియోగదారుల కోర్టుల తీర్పులు వేగంగా, సమర్థవంతంగా వెలువడటంలో డిజిటల్ పద్ధతుల ప్రాముఖ్యతను వివరించారు. పెరుగుతున్న సాంకేతికతతోపాటు వినియోగదారులకు ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయన్నారు. 1986 వినియోగదారుల హక్కుల రక్షణ చట్టానికి, 2019 నాటి వినియోగదారుల హక్కుల రక్షణ చట్టానికి మధ్య ఉన్న వ్యత్యాసాలను వివరించారు. ముఖ్యంగా ఈ-కామర్స్ ఆన్ లైన్, సైబర్ మోసాల నేపధ్యంలో వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో ఎక్కడైతే వస్తువు కొనుగోలు చేస్తామో ఆ కోర్టులోనే కేసు వేయాల్సి ఉండేదని ప్రస్తుత కొత్త చట్టం ప్రకారం, వినియోగదారుడు ఎక్కడ నివసిస్తుంటే అక్కడి నుండే ఆన్ లైన్ లో కేసు ఫైల్ చేసుకునే సౌకర్యం ఏర్పడిందన్నారు.