Entertainment23rd Sep 03:31 PMSunil Byrisetty1 min read

కంటెంటే.. కలెక్షన్ కింగ్!

1000 కోట్ల బడ్జెట్, 10000 మందితో భారీ యాక్షన్ ఎపిసోడ్, టికెట్స్ రేట్ పేరుతో అభిమానులు, ప్రజలపై భారం, ఇప్పుడు పెద్ద నిర్మాతలు ఈ సినిమాను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. కేవలం రూ. 2 కోట్ల

కంటెంటే.. కలెక్షన్ కింగ్!
1000 కోట్ల బడ్జెట్, 10000 మందితో భారీ యాక్షన్ ఎపిసోడ్, టికెట్స్ రేట్ పేరుతో అభిమానులు, ప్రజలపై భారం, ఇప్పుడు పెద్ద నిర్మాతలు ఈ సినిమాను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా ఇప్పటి దాకా రూ. 366 కోట్ల కలెక్షన్ సాధించింది. ‘హనుమాన్‌ అంశ్‌’ కంటెంట్ ఉంటే కలెక్షన్ కింగ్ అవుతుందని మరోసారి నిరూపించిన చిన్న సినిమా. ఓ చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చింది. తొలి రోజు కేవలం రూ.10 లక్షలు మాత్రమే వసూలు చేసింది. రెండు వారాల్లో వచ్చిన కలెక్షన్‌ రూ.1.50 కోట్లలోపే. కానీ ఆ తర్వాత సీన్‌ పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన మౌత్‌ టాక్‌తో దూసుకెళ్లిన ‘హనుమాన్‌ అంశ్‌’ ఇప్పుడు 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో టాప్‌-3లోకి చేరింది. విశాల్‌ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భక్తి ప్రధానమైన చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.366.45 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. దీంతో ‘టాక్సిక్‌’, రామ్‌చరణ్‌ ‘పెద్ది’, విజయ్‌ ‘జన నాయగన్‌’ వంటి భారీ చిత్రాలను వెనక్కి నెట్టింది. ప్రస్తుతం 2026 వరల్డ్‌వైడ్‌ బాక్సాఫీస్‌లో ‘ధురంధర్‌ 2’, ‘బోర్డర్‌ 2’ తర్వాతి స్థానంలో ‘హనుమాన్‌ అంశ్‌’ నిలిచినట్లు ట్రేడ్‌ రిపోర్టులు చెబుతున్నాయి. ‘పెద్ది’ రూ.341.90 కోట్లు, ‘టాక్సిక్‌’ రూ.341.99 కోట్లతో తమ థియేట్రికల్‌ రన్‌ ముగించాయి. ‘జన నాయగన్‌’ సుమారు రూ.325 కోట్ల వసూళ్లు సాధించింది. వీటిని దాటిన ‘హనుమాన్‌ అంశ్‌’ ఏడో వారాంతంలోనూ భారీ వసూళ్లు రాబట్టింది.భారీ స్టార్‌ సినిమాలు పోటీ పడుతున్న సమయంలో ఓ చిన్న భక్తి చిత్రం ఇంతటి వసూళ్లు సాధించడం ట్రేడ్‌ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Scroll for the next article