News27th Jan 04:47 PMSunil Byrisetty1 min read

తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ

రక్షిత తాగునీటి సరఫరా పై నిరంతర పర్యవేక్షణ చేయాలని క్లోరినేషన్ క్లీనింగ్ బైలాజికల్ టెస్టులు నిర్వహించి అనంతరం మాత్రమే తాగునీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంబం

తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ
రక్షిత తాగునీటి సరఫరా పై నిరంతర పర్యవేక్షణ చేయాలని క్లోరినేషన్ క్లీనింగ్ బైలాజికల్ టెస్టులు నిర్వహించి అనంతరం మాత్రమే తాగునీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణ సురక్షిత మంచినీటి సరఫరా గ్రామీణ నీటి సరఫరా పథకాల పనుల ప్రగతిపై మంగళవారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్ నందు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యే శ్రద్ధ తీసుకోవాలని తాగునీటిని సరఫరా పథకాలపై నిరంతర పర్యవేక్షణ చేసి పరిశుభ్రమైన నీటిని మాత్రమే సరఫరా చేయాలని క్లోరినేషన్ క్లీనింగ్ బైలాజికల్ టెస్టులను సకాలంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యుఎస్, పంచాయతీరాజ్, మెడికల్ అండ్ హెల్త్, భూగర్భజల శాఖ, విద్యా, మహిళ శిశు సంక్షేమ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా తాగునీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఓవర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్ చేయడం క్లోరినేషన్ కలిపిన మాత్రమే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రతి నెల బైలాజికల్ టెస్టులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
Andhra Pradesh
Drinking Water Supply
Water Quality Monitoring
District Collector G Lakshmisha
Chlorination
Biological Tests
Public Health
భూగర్భజల శాఖ
ఓవర్ హెడ్ ట్యాంకుల శుభ్రత
జిల్లా పరిపాలన
Scroll for the next article