Politics10th Mar 11:12 AMSunil Byrisetty1 min read
పల్లె పండుగకు.. నిధులు దండిగా!
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధుల కింద పల్లె పండుగ కార్యక్రమంలో రూ.2,882 కోట్ల పనులు మంజూరు చేశారు. ఇందులో రూ.2,405 కోట్లతో 4,287 కి.మీ సిమెంట్ రోడ్లు, రూ.477 కోట
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధుల కింద పల్లె పండుగ కార్యక్రమంలో రూ.2,882 కోట్ల పనులు మంజూరు చేశారు.
ఇందులో రూ.2,405 కోట్లతో 4,287 కి.మీ సిమెంట్ రోడ్లు, రూ.477 కోట్లతో 734 కి.మీ తారురోడ్లు నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నారు.
అయితే, ఇప్పటి వరకు రూ.1,513 కోట్లతో 3,145 కి.మీ సిమెంట్‌రోడ్లు, రూ.138 కోట్లతో 180 కి.మీ తారురోడ్లు పూర్తి చేశారు.
ఇంకా 1,141 కి.మీ సిమెంట్‌రోడ్లు, 548 కి.మీ తారు రోడ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికి 53 శాతం పనులు పూర్తయ్యాయి.
క్యూరింగ్ పీరియడ్ పూర్తి కాకపోవడం తదితర కారణాల వల్ల ఇంజనీర్లు ఎం బుక్ రికార్డు చేయకపోవడంతో అధికారికంగా కొన్ని పనులు పూర్తయినట్లు నివేదికల్లో చూపించలేదు.
కొంత మంది కాంట్రాక్టర్లు బిల్లులు వస్తాయో లేదో చూసి చేద్దామన్న యోచనతో పనులు చేయకుండా ఆలస్యం చేస్తున్నారు.
మరికొందరు మార్చి నెలాఖరులో బిల్లులొస్తాయన్న నమ్మకంతో పనులు వేగవంతం చేస్తున్నారు.
మార్చి నెలాఖరులో కేంద్రం నుంచి నిధులు వచ్చినా ఏప్రిల్ మొదటి వారంలో చెల్లించే అవకాశముందని అధికారులు అంటున్నారు.