Politics25th Oct 11:21 AMSunil Byrisetty1 min read

చిన్న శ్రీనుకు షాక్.. సిరి నామినేషన్‌పై వివాదం..!

విజయనగరం జిల్లా కొత్తవలస, తెర్లాం జెడ్పీటీసీ స్థానాలకు టీడీపీ అభ్యర్థిగా సిరి సహస్ర అలియాస్‌ ముస్కాన్‌ జైన్‌ నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె కుల ధ్రువీకరణ పత్రం వ

చిన్న శ్రీనుకు షాక్.. సిరి నామినేషన్‌పై వివాదం..!
విజయనగరం జిల్లా కొత్తవలస, తెర్లాం జెడ్పీటీసీ స్థానాలకు టీడీపీ అభ్యర్థిగా సిరి సహస్ర అలియాస్‌ ముస్కాన్‌ జైన్‌ నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె కుల ధ్రువీకరణ పత్రం వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఆమె సమర్పించినట్లు చెబుతున్న బీసీ కుల ధ్రువీకరణ పత్రంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సిరి సహస్ర అసలు పేరు ముస్కాన్‌ జైన్‌ అని, ఆమె తండ్రి పేరు రమేష్‌ జైన్‌ అని పేర్కొంటూ, ఓసీ వర్గానికి చెందిన వ్యక్తికి బీసీ సర్టిఫికెట్‌ ఎలా జారీ చేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీసీ రిజర్వేషన్‌ స్థానంలో ఆమె నామినేషన్‌ను ఎలా కొనసాగిస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తహసీల్దార్‌ బీసీ సర్టిఫికెట్‌ ఎలా జారీ చేస్తారని, వైసీపీ నేతలు ప్రశ్నించారు. దీంతో ఆమె కుటుంబం వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినా పదవి దక్కదా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Scroll for the next article