News6th Oct 11:24 AMSunil Byrisetty1 min read

వివాదాస్పదంగా ఏపీపీఎస్సీ సభ్యుడి తీరు

రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో ఓ సభ్యుడు నిబంధనలకు నీళ్లొదిలేసినట్లు తెలుస్తోంది. కమిషన్ సభ్యుడిగా ఉన్న పరిగె సుధీర్ సొంత టెలిగ్రామ్ గ్ర

వివాదాస్పదంగా ఏపీపీఎస్సీ సభ్యుడి తీరు
రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో ఓ సభ్యుడు నిబంధనలకు నీళ్లొదిలేసినట్లు తెలుస్తోంది. కమిషన్ సభ్యుడిగా ఉన్న పరిగె సుధీర్ సొంత టెలిగ్రామ్ గ్రూప్‌లో కీలక సమాచారాన్ని అనధికారికంగా వెల్లడిస్తుండటం కలకలం రేపుతోంది. విధానపరమైన నిర్ణయాలపై అభ్యర్థులతో పోల్స్ నిర్వహించడం, గోప్యంగా ఉండాల్సిన ప్రతిపాదనలను బహిర్గతం చేయడంతో నిరుద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. సుమారు 3,600 మంది సభ్యులున్న టెలిగ్రామ్ గ్రూప్‌లో పరిగె సుధీర్ చురుకుగా వ్యవహరిస్తున్నారు. "గ్రూప్-1, 2 ఫలితాలకు ముందు జనరల్ ర్యాంకింగ్ జాబితాలు విడుదల చేయాలా, వద్దా?", "గ్రూప్-2 అభ్యర్థులకు పోస్టు ప్రాధాన్యతకు మరో అవకాశం ఇవ్వాలా?" వంటి కీలక అంశాలపై ఆయన పోల్స్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షను నియామకానికి ముందా లేక తర్వాతా నిర్వహించాలన్న దానిపై కూడా అభ్యర్థుల అభిప్రాయాలు కోరుతున్నారు. ఈ పోల్స్ ఫలితాలను ఛైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా చూస్తానని ఆయన హామీ ఇస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Andhra Pradesh
APPSC
Parige Sudheer
Controversy
Government Jobs
Recruitment
Group 1
Group 2
Telegram Group
Leak
Public Service Commission
నిబంధనల ఉల్లంఘన
సోషల్ మీడియా
ఉద్యోగ అభ్యర్థులు
Scroll for the next article