Technology29th Aug 11:59 AMSunil Byrisetty1 min read

'కూల్ఫాబెట్స్' రూపొందించడం అభినందనీయం

నేటి డిజిటల్ తరంలోనూ పిల్లలకు తెలుగు అలవాటు కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. చిన్ననాటి నుంచే అక్షరంపై ఆసక్తి, భాషపై అభిమానం పెంచాలని సూచించారు. 'కూల్ఫాబెట్స్' యాప్ రూపొందించడం అభినం

'కూల్ఫాబెట్స్' రూపొందించడం అభినందనీయం
నేటి డిజిటల్ తరంలోనూ పిల్లలకు తెలుగు అలవాటు కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. చిన్ననాటి నుంచే అక్షరంపై ఆసక్తి, భాషపై అభిమానం పెంచాలని సూచించారు. 'కూల్ఫాబెట్స్' యాప్ రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కొల్లు రంజిత్, వెంకట్ ఏలేటితో పాటు వారి బృందాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా యాప్ విడుదల హర్షణీయమని పేర్కొన్నారు. సాంకేతికత మన భాషకు దూరం చేయకూడదు.. మరింత చేరువ చేయాలని సూచించారు. మన భాష, మన లిపి మన సంస్కృతికి చిరునామా అని చెప్పారు. తేనెలొలుకు తెలుగు భావితరాల్లోనూ చిరస్థాయిగా వెలుగొందాలని సీఎం అన్నారు.
Andhra Pradesh
Coolphabets
Telugu Language
Telugu Bhasha Dinotsavam
Chandrababu Naidu
Telugu App
Digital Learning
Telugu Education
Language Learning
పిల్లల విద్య
సాంకేతికత
తెలుగు లిపి
ఆంధ్రప్రదేశ్
తెలుగు సంస్కృతి
విద్యా సాంకేతికత
Scroll for the next article