News3rd May 11:23 AMSunil Byrisetty1 min read
కడపలో కార్డన్ సెర్చ్!
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కడపలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్.పి ఇ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కడప వన్ టౌన్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపర
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కడపలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
జిల్లా ఎస్.పి ఇ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కడప వన్ టౌన్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
అనుమానిత వ్యక్తుల ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
కడప వన్ టౌన్ సి.ఐ బి. రామకృష్ణ, ఎస్.ఐ లు అమర్ నాధ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, తాలూకా ఎస్.ఐ తులసి నాగ ప్రసాద్, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.
తనిఖీల్లో రికార్డులు లేని 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.