News10th Nov 02:30 PMSunil Byrisetty1 min read
వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదం కూడా కల్తీ
వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని, వైసీపీ హయాంలో ప్రభుత్వ పెద్దలు నిస్సిగ్గుగా వ్యవహరించారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని, వైసీపీ హయాంలో ప్రభుత్వ పెద్దలు నిస్సిగ్గుగా వ్యవహరించారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు సీట్‍ను ఏర్పాటు చేయాలని ఆదేశించిందన్నారు. టీటీడీని జగన్ ప్రభుత్వం ఆదాయ వనరులుగా పరిగణించిందని ఆరోపించారు. సీబీఐ విచారణలో నిర్ఘాంతపోయే నిజాలు వెల్లడయ్యాయని చెప్పారు. 68 లక్షల కేజీల కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారన్నారు. కల్తీ నెయ్యి తయారీ, వినియోగం తెలిసి చేసిన పాపమని మండిపడ్డారు. గత టీటీడీ బోర్డులో అక్రమాలపై వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నెయ్యిలో నాణ్యత లేదని.. నెయ్యిలో కల్తీ జరిగిందని ఫిర్యాదులొచ్చినా కంపెనీ ఓనర్‍పై చర్యలు తీసుకోలేదని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు.