News28th Oct 01:27 PMSunil Byrisetty1 min read

రేపటి నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మం

రేపటి నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మెంథా తుఫాను తీవ్రత నేపథ్యంలో, రైతులు నష్టపోకుండా ఉండేందుకు గాను, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 కొనుగోలు కేంద్రాలలో తక్షణమే ప్రత్తి సేకరణ చేపట్టాలని సీసీఐ, సంబంధిత అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, 2025-26 సంవత్సరానికి 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగైనట్లు, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాలుకు రూ. 8,110/- కనీస మద్దతు ధరను రైతులకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పత్తి అమ్ముకోవాలనుకునే రైతులు కొనుగోలు ప్రక్రియను సక్రమంగా పాటించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను సీఎం యాప్ లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత "కపాస్ కిసాన్" యాప్‌లో అదే విఏఏ సహాయంతో స్లాట్ బుక్ చేసుకొని, స్లాట్ ప్రకారం సిసిఐ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి కొనుగోలు కేంద్రాల ద్వారా (జిన్నింగ్ మిల్లుల ద్వారా) మాత్రమే పత్తిని అమ్ముకోవాలని కోరారు.
Andhra Pradesh
Cotton Procurement
Farmers Support
Kinjirapu Achennaidu
CCI
Agricultural
MSP
Cotton Sale Process
2025-26 Cotton Season
Farmer Welfare
కనీస మద్దతు ధర
పత్తి సేకరణ
రైతుల సంక్షేమం
పత్తి సీజన్
Scroll for the next article