News10th Jul 03:12 PMSunil Byrisetty1 min read
రావణ్ కస్టడీ పిటిషన్ విచారణ 14కి వాయిదా
రావణ్ కస్టడీ పిటిషన్ విచారణ ఈ నెల 14కి వాయిదా పడింది. గన్నవరం కోర్టులో రావణ్ తరఫున వైసీపీ లీగల్ సెల్ హాజరైంది. సోషల్ మీడియా కామెంట్ల కేసులో అరెస్టు అయిన రావణ్ కస్టడీ పిటిషన్ పై విచ
రావణ్ కస్టడీ పిటిషన్ విచారణ ఈ నెల 14కి వాయిదా పడింది. గన్నవరం కోర్టులో రావణ్ తరఫున వైసీపీ లీగల్ సెల్ హాజరైంది. సోషల్ మీడియా కామెంట్ల కేసులో అరెస్టు అయిన రావణ్ కస్టడీ పిటిషన్ పై విచారణను గన్నవరం కోర్టు ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. రావణ్ ను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గన్నవరం కోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా రావణ్ తరఫున వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు పొన్నవోలు సుధాకర్, ఓ.గవాస్కర్, తిరువీధి వెంకయ్య కోర్టుకు హాజరయ్యారు. అయితే ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాదులు కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయాధికారి పిటిషన్ విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేశారు. దీంతో వైసీపీకి, జోసెఫ్ రావణ్ కి మధ్య ఉన్న లెక్కలేంటని సోషల్ మీడియాలో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రావణ్ వెనుక వైసీపీ ఉండి నడిపిస్తోందంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.