News2nd Sep 12:15 PMSunil Byrisetty1 min read

మాజీ మంత్రి ప్రత్తిపాటిపై కేసుల కొట్టివేత

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన అనుచరులపైన వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు అక్రమంగా పెట్టిన రెండు కేసులను చిలకలూరిపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణ అనంతర

మాజీ మంత్రి ప్రత్తిపాటిపై కేసుల కొట్టివేత
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన అనుచరులపైన వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు అక్రమంగా పెట్టిన రెండు కేసులను చిలకలూరిపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణ అనంతరం సోమవారం జడ్జి కే నరేంద్ర రెడ్డి కొట్టివేశారు. కోటప్పకొండ తిరణాల్లో, పోలీస్ స్టేషన్ ముట్టడి అంటూ అప్పుడు పాలకులు పెట్టించిన అక్రమ కేసు మరల 2023 సెప్టెంబరులో చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ చిలకలూరిపేట నియోజక వర్గంలో టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో ప్రత్తిపాటి పిలుపు మేరకు జాతీయ రహదారిపై తిమ్మాపురం వద్ద ధర్నా చేశారని యడ్లపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. ఈ కేసులో ప్రత్తిపాటితో పాటు యడ్లపాడు మండలానికి చెందిన మరో 20 మంది సీనియర్ టీడీపీ నాయకులపై కేసు నమోదయింది. కాగా 2024లో చిలకలూరిపేట అర్బన్ పోలీసుస్టేషన్లో నమోదైన మరొక కేసుకు సంబంధించి కూడా ప్రత్తిపాటితో పాటు మరో 29 మందిపై కోర్టులో విచారణ జరిగింది. అప్పటి మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీ, అతని అనుచరులు, పలువురు వైసీపీనేతలు కోటప్పకొండ వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఘర్షణకు పాల్పడిన అనంతరం చిలకలూరిపేట అర్బన్ పోలీసు స్టేషన్ వద్ద జరిగిన ఘటనపై టీడీపీనేతలు, కార్యకర్తలతో పాటు ప్రత్తిపాటిపై కూడా కేసు నమోదయింది. ఈ రెండు కేసులకు సంబంధించి మొత్తం 51 మందికి విముక్తి లభించింది.
Andhra Pradesh News
Prathipati Pullarao
TDP
YSRCP
Chilakaluripet Court
Case Dismissal
Kotappakonda
చంద్రబాబు అరెస్ట్ నిరసనలు
రాజకీయ కేసులు
Scroll for the next article