News5th Jun 12:29 PMSunil Byrisetty1 min read
దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు!
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 1,238 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా ఒకే రోజులో కరోనాతో ఏడుగురు మృతి చెందడం కలకలం రేపుతోంది. భారత్‍లో ప్
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 1,238 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా ఒకే రోజులో కరోనాతో ఏడుగురు మృతి చెందడం కలకలం రేపుతోంది. భారత్‍లో ప్రస్తుతం 4,866 యాక్టివ్ కేసులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. కర్నాటకలో సైతం కరోనాతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ఏడాదిలో కరోనాతో మొత్తం 51 మంది మృతి చెందినట్లు గుర్తించారు. కేరళలో అత్యధికంగా 1,487 యాక్టివ్ కేసులు ఉండగా.. ఏపీలో 50, తెలంగాణలో 3 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు.