News26th May 10:38 AMSunil Byrisetty1 min read
కరోనాతో.. జర జాగ్రత్త..! కేంద్రం అలర్ట్..
ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. కొత్త రూపంలో దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణాల్లోనే కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితులు కనిపిస
ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. కొత్త రూపంలో దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణాల్లోనే కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. NB.1.8.1, LF.7 అనే కరోనా వేరియంట్స్ ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. అప్రమత్తంగా ఉండాలని.. ఆస్పత్రులను సిద్ధం చేసుకోవాలంటూ అధికారులు సూచనలు జారీ చేశారు. దేశంలోనే అత్యధికంగా కేరళలో 200మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దాంతో.. ఆస్పత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేసింది కేరళ ప్రభుత్వం.. మహారాష్ట్ర ముంబైలోనే ఈ నెలలో 95 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
కర్నాటకలో 35 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
ఢిల్లీలో 24 గంటల్లో 23 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ కరోనా కలవరం మొదలైంది.
తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. విశాఖలో 2 కరోనా కేసులు, కడపలో రెండు కేసులు నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
అలెర్ట్ అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. విశాఖ జీజీహెచ్‌లో కరోనా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.