National21st Jul 04:43 PMSunil Byrisetty1 min read
కోవిడ్ కలకలం.. పెరుగుతున్న కేసులు
దేశంలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19కు చేరాయి. అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్య
దేశంలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19కు చేరాయి. అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కాకినాడ జిల్లాల్లో రెండేసి, విశాఖ, ఏలూరు, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌ను గుర్తించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. కరోనా ఒమిక్రాన్ RF 5 వేరియంట్ లక్షణాలు సాధరణంగానే ఉంటాయని.. పెద్దగా ప్రమాదం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, అలసట RF 5 లక్షణాలుగా తెలిపారు. సింగపూర్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో RF 5 కేసులు వెలుగు చూస్తున్నాయని, RF 5 వేరియంట్‌పై ఆందోళన అవసరం లేదని ఆరోగ్యశాఖ వెల్లడించింది.