News10th Jul 04:20 PMSunil Byrisetty1 min read
ఏపీలో కరోనా కలకలం.. 5 కేసులు నమోదు
ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మరోసారి కలకలం రేపుతోంది. ఏపీలో తాజాగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కడప జిల్లాలో ఐదు కోవిడ్-19 కేసులు నమోదుకాగా, ఇద్దరు మరణించారు. ఈ ఘటనపై రాష
ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మరోసారి కలకలం రేపుతోంది. ఏపీలో తాజాగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కడప జిల్లాలో ఐదు కోవిడ్-19 కేసులు నమోదుకాగా, ఇద్దరు మరణించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మృతులు ఇప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ వెల్లడించింది. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి సమాచారం లేదన్న ప్రచారం అసత్యమని స్పష్టం చేసింది. నమోదైన కేసులపై ఆరోగ్యశాఖ నిఘా కొనసాగిస్తోందని పేర్కొంది. వైరస్‌లో కొత్త వేరియంట్లు ఉన్నాయా అని తెలుసుకునేందుకు నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు జన్యు విశ్లేషణ కోసం పంపిస్తున్నట్లు తెలిపింది.