News17th Aug 04:38 PMSunil Byrisetty1 min read
తగ్గిన కోవిడ్ ప్రభావం
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా (కోవిడ్-19) వ్యాప్తి తక్కువ స్థాయిలోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు దేశంలో 2,554 కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా (కోవిడ్-19) వ్యాప్తి తక్కువ స్థాయిలోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు దేశంలో 2,554 కేసులు నమోదుకాగా, ఏపీలో 74 కేసులు నమోదయ్యాయని, వైరస్ సమూహాలుగా (క్లస్టర్లుగా) వ్యాప్తి చెందుతున్న దాఖలాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నమోదైన 74 కేసుల్లో 56 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం కేసులు అక్కడక్కడా మాత్రమే నమోదవుతున్నాయని, వ్యాప్తి పెరుగుతున్న సూచనలు లేవని అధికారులు పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో కేరళ 780 కేసులతో మొదటి స్థానంలో ఉంది. తమిళనాడు 372, పశ్చిమ బెంగాల్ 261, కర్ణాటక 247, ఢిల్లీ 227, మహారాష్ట్ర 169, మిజోరం 126 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 74 కేసులతో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉందని మంత్రి తెలిపారు.
ఆగస్టు 16 నాటికి రాష్ట్రంలోని 17 జిల్లాల్లో మొత్తం 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది.మొత్తం 74 మందిలో 56 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.