News14th Nov 12:58 PMSunil Byrisetty1 min read

రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి అనేక ఇబ్బందులు

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొందని, అయితే ప్రసుతం ఏపీలో వ్యాపారానికి ప్రశాంతమైన వాతావరణం నెలకొందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ అన్నారు. సరైన సమయంలో సరైన ఆలోచనే విజయా

రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి  అనేక ఇబ్బందులు
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొందని, అయితే ప్రసుతం ఏపీలో వ్యాపారానికి ప్రశాంతమైన వాతావరణం నెలకొందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ అన్నారు. సరైన సమయంలో సరైన ఆలోచనే విజయానికి పునాది అని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తోనే పెట్టుబడులు వస్తాయని ఉపరాష్ట్రపతి చెప్పారు. శుక్రవారం విశాఖ ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సును భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ పాలనలో 11 ఏళ్లుగా దేశం ముందుకెళ్తోందని, వికసిత్ భారత్‌ ట్రాక్‌పై మనదేశం పరుగులు పెట్టాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. అన్ని దేశాలతో స్నేహం కోరుకుంటామని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటామని చెప్పారు. విశాఖ..మరిన్ని మైలురాళ్లు అధిగమించాలని కోరుకుంటున్నానని, మూడు దశాబ్దాలుగా చంద్రబాబు తనకు స్నేహితుడు అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. దేశంలో పేదరికం తగ్గించేందుకు కేంద్రం అనేక చర్యలు చేపడుతొందని, వ్యాపార అనుకూల రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు.
Andhra Pradesh
AP Development
State Bifurcation
Vice President Radhakrishnan
Business-Friendly State
Ease of Doing Business
Visakhapatnam Summit
సీఐఐ సదస్సు
చంద్రబాబు నాయుడు
మోదీ ప్రభుత్వం
పెట్టుబడులు
అభివృద్ధి వార్తలు
Scroll for the next article