News29th Jul 09:14 AMSunil Byrisetty1 min read
ఆగస్టు 5న విద్యుత్ ఉద్యమం
విద్యుత్ చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకిస్తూ, అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంల
విద్యుత్ చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకిస్తూ, అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 5వ తేదీన అన్ని విద్యుత్ కార్యాలయాల ఎదుట తలపెట్టిన విద్యుత్ ఉద్యమం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు యావత్తూ విద్యుత్ కార్యాలయాల వద్దకు అన్ని వామపక్ష, ప్రజా సంఘాలను కలుపుకుని నిరసనలు తెలపాలన్నారు. ప్రభుత్వం దిగివచ్చేలా ఈ ఉద్యమం సాగాలని సూచించారు. వచ్చేనెల ఒంగోలులో జరగనున్న సీపీఐ 28వ రాష్ట్ర మహాసభల విజయంతానికి పార్టీ శ్రేణులు సన్నద్దులు కావాలన్నారు. విద్యుత్ చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకిస్తూ, అదానీతో విద్యుత్ ఒప్పందాల్ని రద్దు చేయాలని విజయవాడ దాసరి భవన్ కేంద్రంగా వామపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి, ఉద్యమ కార్యాచరణ రూపొందించిందని గుర్తుచేశారు. ఆ మేరకు ఆయా జిల్లాల వారీగా వామపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలకు బాధ్యతలు కేటాయించినట్లు వివరించారు. ఇంటింటా కరపత్రాల్ని పంపిణీ చేస్తూ..ఈ ఉద్యమంలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలన్నారు.