News26th May 11:24 AMSunil Byrisetty1 min read

ఆపరేషన్‌ కగార్‌ ఆపాలి!

ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే ఉపసంహరించాలని, సీపీఐ(మావోయిస్టు) పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతియుత చర్చలు జరపాలని రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. మావోయిస్టు నేత నంబాల కేశవరావుతోప

ఆపరేషన్‌ కగార్‌ ఆపాలి!
ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే ఉపసంహరించాలని, సీపీఐ(మావోయిస్టు) పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతియుత చర్చలు జరపాలని రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. మావోయిస్టు నేత నంబాల కేశవరావుతోపాటు మృతుల భౌతిక కాయాలను వారి బంధువులకు అప్పగించాలని తీర్మానించింది. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను నిరసిస్తూ సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడ దాసరి భవన్‌లో రౌండ్‌ టేబుల్‌ నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో పాటు వామపక్ష పార్టీలు, వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు, మేధావులు హాజరయ్యారు. రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో..సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టిన 9 అంశాలతో కూడిన తీర్మానాన్ని రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. సీపీఐ (మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఇంకా అనేక మంది పార్టీ నాయకులు, ఆదివాసీలను బూటకపు ఎదురు కాల్పుల పేరిట మోడీ ప్రభుత్వం హత్మ చేసిన చర్యను ఈ సమావేశం తీవ్రంగా ఖండించింది.
Vijayawada
CPI
Operation Kagar must be stopped immediately
Maoists
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
9 అంశాలతో కూడిన తీర్మానాన్ని రౌండ్‌టేబుల్‌ సమావేశం
Scroll for the next article